ప్రశాంతంగా విద్యా కమిటి ఎన్నిక.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
తల్లిదండ్రుల భాగస్వామ్యం పాఠశాలల నిర్వహణ పై ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సంకల్పించిన విద్యా కమిటీల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన విద్యా కమిటి ఎన్నిక నిర్వహణ కొరకు ఏర్పాటు చేసిన ప్రక్రియలో ఆ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు చైర్మన్, పాలక వర్గాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వ సంకల్పం ఏదైనా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం విద్యా కమిటీల ఎన్నికలు అధికార ప్రతిపక్ష పార్టీలకు రాజకీయంగా ప్రతిష్టాత్మకం అయ్యాయి. సింగరాయకొండ మండలం పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎట్టి పరిస్థితి లో ను ఈ పాఠశాల విద్యా కమిటీ ని తమ కైవసం చేసుకోవాలని అధికారపక్షం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దాంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టి డి పి శ్రేణులు మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్,ఇతర నాయకులు పాకల విద్యా కమిటి ఎన్నికల సందర్భంగా క్రియాశీలక పాత్ర పోషించారు.అదే విధంగా ప్రతి పక్ష పార్టీ వై ఎస్ ఆర్ సి పి ఈ ఎన్నికల లో పోటీ కోసం చర్యలు చేపట్టింది.ఎన్నిక సందర్భంగా వై ఎస్ ఆర్ సి పి శ్రేణులు ఎన్నికలు జరిగే ప్రదేశానికి పోనివ్వకుండా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల సందర్భంగా అధికార ప్రతిపక్ష పార్టీలు తపగతారని అందిన సమాచారం తో సింగరాయకొండ ఎస్ ఐ లేళ్ల సుధీర్ కుమార్ స్వయంగా రంగంలో కి దిగి శాంతి భద్రతలు పర్యవేక్షించారు. ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పరిరక్షణ కొరకు పోలింగ్ జరిగే ప్రాతం లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఎట్టకేలకు ఎన్నిక ఏకపక్షం కావడం, ప్రశాంత వాతావరణం చోటు చేసుకోవడం పోలీస్ ఊపిరి పీల్చుకున్నారు.