ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.ఈ క్రమంలో దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో కురిచేడు ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేకంగా పరిశీలించారు.
అదేవిధంగా దర్శి సీఐ గారి ఆధ్వర్యంలో గుర్రాల కాలనీలో CASO ఆపరేషన్‌తో పాటు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా మాట్లాడి, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ మరియు రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారు.ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ శాంతియుతంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఎన్నికల నిబంధనలను పాటించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.ప్రజల భద్రత, ప్రశాంతమైన ఎన్నికలు, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం నిఘా మరియు ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *