తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కోటారెడ్డి హాస్పిటల్ ఎదురు ధర్నా – కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన చదలవాడ రాజా ఎలక్ట్రీషియన్ పని చేస్తుంటాడు. 4 రోజుల క్రితం అనారోగ్యంతో, కందుకూరులోని కోటారెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో చేరాడు. సోమవారం ఆపరేషన్ చేస్తామని చెప్పారు. ఆదివారం రాత్రి కండిషన్ సీరియస్ గా ఉండడంతో, రాజాను ఒంగోలు ప్రైవేటు హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడ చనిపోయాడు. కోటారెడ్డి హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని, అతని కుటుంబానికి న్యాయం చేయాలని రాజా కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పిటల్ ఎదురు ఆందోళన చేపట్టారు.