నేరాల నియంత్రణకు ప్రత్యేక తనిఖీలు – ప్రజలతో అవగాహన సమావేశం నిర్వహించి శాంతిభద్రతలపై పోలీసుల సూచనలు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రాజాపానగల్ రోడ్డులో ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గారి ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసు సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు మరియు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేకంగా పరిశీలించారు. తనిఖీలలో 13 వాహనాలను స్వాధీనం చేసుకుని, వాటికి సంబంధించిన వివరాలు, ధ్రువపత్రాలపై తదుపరి పరిశీలన చేపట్టారు.అదేవిధంగా ప్రాంతంలోని ప్రజలతో అవగాహన సమావేశం నిర్వహించి, నేరాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ, అనుమానాస్పద కార్యకలాపాలపై అప్రమత్తత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ, ఏదైనా అనుమానాస్పద విషయం గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక తనిఖీలు, నిఘా మరియు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.