కొండపి నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు మంత్రి డా.స్వామి పిలుపు
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :
ఈ నెల 9 వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొండపి నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో సోమవారం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం IOC వద్ద దామచర్ల సత్య గారి కార్యాలయంలో కొండపి నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొండపి నియోజకవర్గంలోని నర్సింగోలులో పర్యటించి 8,000 మందికి పైగా రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను అందజేయనున్నట్లు తెలిపారు. కలికివాయి, బిట్రగుంట, నర్సింగోలు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం నర్సింగోలులో ముఖ్యమంత్రి పర్యటన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గ పర్యటనకు అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు, కూటమి కార్యకర్తలు పాల్గొనేలా చూడాలన్నారు. నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ బూత్ ఇంచార్జ్ లు అందరూ సమన్వయంతో పని చేసి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సమావేశంలో కొండపి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, బూత్ ఇన్చార్జిలు పాల్గొన్నారు