కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరులోని 17వ వార్డుకు చెందిన వివిధ సామాజిక వర్గాల నాయకులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారిని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సోమవారం కలిశారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న పట్టుదలతో కృషిచేసి విజయం సాధించారని ఎమ్మెల్యే గారికి నేతలు కృతజ్ఞతలు తెలిపారు.మున్సిపాలిటీకి పాలకమండలి ఏర్పాటయితే, మరిన్ని నిధులు వచ్చేందుకు వీలుందన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారు తెలియజేశారు. వార్డు అధ్యక్షుడు కొత్త నరేంద్ర, అన్న క్యాంటీన్ డైరక్టర్ కాకుమాని ప్రవీణ్, నాయకులు ఇమ్మడిశెట్టి సుబ్బారాయుడు, మురారిశెట్టి సుబ్బారావు, కంకణాల వెంకటేశ్వర్లు, అరటిపాముల శరభయ్య, అవ్వారు ముసలయ్య, ఆకురాతి శ్రీనివాసరావు,
తోట సురేష్, పసుపులేటి లక్ష్మణ్, గంటా శివ, జాదవ్ అజయ్, నాగిశెట్టి సురేష్, తేలప్రోలు సాయి కిరణ్,
తోట పృథ్వి తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *