తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ… ప్రభుత్వ ఆదేశాలతో కందుకూరులో మంగళవారం వరుణయాగం నిర్వహించారు. జనార్ధనస్వామి దేవాలయంలో జరిగిన యాగంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు సహా బిజెపి, జనసేన నేతలు పాల్గొన్నారు.ముందుగా పండితులు, అధికారులు… ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. జనార్ధనస్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం యాగక్రతువు నిర్వహించారు. ద్రవ్యాలను హోమగుండంలో సమర్పించారు.ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ…. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దేవుళ్ళ చల్లని చూపుతో వర్షాలు బాగా కురవాలని, వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఈవో బైరాగి చౌదరి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఉన్నం భాస్కర్ రావు, పట్టణ టిడిపి అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఘట్టమనేని హరిబాబు, వరప్రసాదరావు, భూషయ్య, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తిరిగి యువత ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీను, జనసేన పట్టణ అధ్యక్షుడు కళ్యాణ్, టిడిపి నాయకులు గుమ్మా శివ, ముప్పవరపు వేణు, భవనాసి వెంకటేశ్వర్లు, మచ్చా మనోహర్, సూర్యనారాయణ, కంకణాల వెంకటేశ్వర్లు, కోటా కిషోర్, వాసు, రూబీ, రఫీ, జియావుద్దీన్, అహ్మద్, పసుపులేటి రమణయ్య, శివరామకృష్ణ, చెంచు నారాయణ, తలమంచి బ్రహ్మయ్య, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.