గుంటూరు ఎస్పీ కార్యాలయంలో పద్మశ్రీ, MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను గుంటూరుకు చెందిన ముస్లిం న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ పాఠశాలలో సయ్యద్ తౌషిక్ అనుమానాస్పద మృతి, అనంతరం ఆయన తల్లి ఆత్మహత్య ఘటనపై వాస్తవాలను వెలికితీసేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న “చలో ఒంగోలు” కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి నిరంతరం శ్రమిస్తూ ముస్లిం అందరిని ఏకతాటిపై తీసుకు వస్తున్న మందకృష్ణ మాదిగ గారిని అభినందించడం జరిగింది ఈ సందర్భంగా సుమారు 50 వేల మంది ప్రజలతో ఒంగోలు కలెక్టరేట్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మందకృష్ణ మాదిగ గారితో “చాయ్ విత్ మందకృష్ణ మాదిగ” కార్యక్రమంలో ముస్లిం న్యాయవాదులు చర్చించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు షేక్ సుభాని, షేక్ గౌస్ బాషా, అనీఫ్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *