ఉలవపాడు మండలం,రామాయపట్నం గ్రామంలోని జెడ్ పి హెచ్ యస్ ప్రభుత్వం పాఠశాల నందు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు ప్రకాశం జిల్లా దిశ వారి ఆదేశాల మేరకు లింక్ వర్కర్ స్కీమ్ వారి ఆధ్వర్యంలో , హెచ్ యం సార్ యన్, లక్ష్మోజీ గారి సహకారంతో, హెచ్ ఐ వి/ఎయిడ్స్, క్షయ వ్యాధి మరియు సుఖ వ్యాధుల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో హెచ్ యం సార్ మాట్లాడుచు, ప్రతి ఒక్కరూ విద్యార్థి దశనుండి హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని, ఎవ్వరకూడ చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని అని, ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిసలై వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని తెలియజేసినారు , స్థానిక లింక్ వర్కర్ వీరమల్లు రవీంద్ర మాట్లాడుచు హెచ్ ఐ వి అంటూ వ్యాధి కాదు అని అంటినుకొను వ్యాధి అని, హెచ్ ఐ వి ఒకరి నుండి మరొకరికి నాలుగు మార్గాలు ద్వారా వ్యాప్తి చెందుతుందని, హెచ్ ఐ వి పరీక్షలు, అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఐ సి టి సి సెంటర్స్ లో హెచ్ ఐ వి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని హెచ్ ఐ వి తో జీవిస్తున్న వారికి ప్రభుత్వం వారు ప్రతి నెలా ఉచితంగా ఏ ర్ టి మందులు పంపిణీ చేస్తున్నారు అని, ఏ ర్ టి మందులు వాడిన ఎడల, వారి జీవిత కాలం పెరుగుతుందని, మరియు క్షయ, వ్యాధి అంటూ వ్యాధి అని, క్షయ వ్యాధికి సక్రమంగా మందులు వాడిన ఎడల ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని, మరియు సుఖ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో హెచ్ యం సార్ మరియు యం ఎల్ హెచ్ పి కె, రమ్య ఏ యన్ యం , గుండెమడుగుల సుమతి ,ఉపాధ్యాయురాలు కె, సుబ్బలక్ష్మి మరియు ఉపాధ్యని ఉపాధ్యాయులు, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *