విద్యారంగంలో 24 సంవత్సరాల సుదీర్ఘ సేవతో పాటు, వినూత్న బోధనా పద్ధతులు, సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయుడు అర్రిబోయిన రాంబాబు గారికి యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డును ప్రదానం చేసింది. విద్యను మరింత సులభంగా, ఆసక్తికరంగా విద్యార్థులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఆయన ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ప్రత్యేక బోధనా విధానాలను అనుసరిస్తున్నారు. PPT ప్రెజెంటేషన్లు, విద్యా వెబ్‌సైట్ల ద్వారా తెలుగు, ఆంగ్లం,గణితం వంటి విషయాలను సులభంగా నేర్చుకునేలా కృషి చేస్తున్నారు. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే కాకుండా, సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో అవసరమైన వారికి సహాయం అందించి మానవతా విలువలను చాటుకున్నారు. విద్యాబోధనలో నూతన ఆలోచనలు, డిజిటల్ విద్యా సాధనాల వినియోగం, ప్రజలకు సహాయం చేయాలనే సేవాభావం వంటి అంశాల్లో ఆయన చేసిన కృషికి ఈ డాక్టరేట్ గుర్తింపుగా నిలుస్తోంది. 24 ఏళ్ల విద్యాసేవా ప్రస్థానంలో ఈ గౌరవం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవడంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, విద్యారంగానికి చెందిన పలువురు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. విద్యతో జ్ఞానాన్ని పంచుతూ.. సేవతో మానవత్వాన్ని చాటుతూ.. సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్న అర్రిబోయిన రాంబాబు గారికి ఈ డాక్టరేట్ గౌరవం ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *