తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
దేశవ్యాప్తంగా పోలీసు శాఖల మధ్య సమన్వయం, ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వివిధ ప్రాంతాల పోలీసు బలగాల భాగస్వామ్యాన్ని చాటిచెప్పే కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర బలగాలు, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ పోలీసు అధికారులు పాల్గొన్న బైక్ ర్యాలీ ప్రకాశం జిల్లా మీదుగా సాగింది.ఈ క్రమంలో కేంద్ర బలగాలు, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ పోలీసు అధికారులు పాల్గొన్న బైక్ ర్యాలీ సంతమాగులూరు పోలీస్ స్టేషన్ పరిధి నుంచి గుజరాత్ రాష్ట్రంలోని ఏక్తానగర్ వైపు ప్రయాణించింది.ఈ ర్యాలీ వివిధ ప్రాంతాల మీదుగా సాగుతూ పోలీసు శాఖల మధ్య పరస్పర సహకారం, సమన్వయం, ప్రజా భద్రత పట్ల నిబద్ధతను చాటిచెబుతోంది. ర్యాలీ ప్రకాశం జిల్లా మీదుగా వెళ్లిన సందర్భంగా సంబంధిత పోలీసు అధికారులు రాకపోకలు సజావుగా సాగేందుకు అవసరమైన సమన్వయం చేపట్టారు.ప్రజా భద్రత, పోలీసు శాఖల మధ్య సహకారం, సమర్థవంతమైన విధుల నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది.