తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించడం, ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో గుడ్లూరు సర్కిల్ పరిధిలోని వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధి అత్తింటివారిపాలెం గ్రామంలో గుడ్లూరు సీఐ గారి ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, నేరాలకు ఆస్కారం ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన
తనిఖీల అనంతరం గ్రామ ప్రజలతో పోలీసులు మాట్లాడి పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
రోడ్డు భద్రత: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, అతివేగం మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు.సైబర్ నేరాలు: ఆన్లైన్ మోసాలు, అనుమానాస్పద లింకులు, ఓటీపీ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మహిళలపై నేరాల నివారణ: మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వేధింపులు లేదా ఇతర నేరాలు ఎదురైతే పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు.గంజాయి నివారణ: మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.ఎన్నికల నిబంధనలు: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు లేదా చట్టవిరుద్ధ చర్యలు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.