నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులకు సంబంధించిన బీ ఫారాలను మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ బీద రవిచంద్ర గారు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు,ఇతర జిల్లా నాయకుల సమక్షంలో స్వీకరించాను.కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తాం. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరం సమన్వయంతో ముందుకు సాగుతాం.ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గారు, నెల్లూరు కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థి శ్రీ రూప్‌ కుమార్‌ గారు, ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *