తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
వైసీపీ సీనియర్ నాయకుడు సర్దార్, ఆ పార్టీకి చెందిన బషీర్ సైతం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలోని 8వ వార్డు నుంచి బషీర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకులు షేక్ రహ్మత్ బాషా, మహబూబ్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి ప్రజాసేవకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేస్తామని వెల్లడించారు.