దసరా మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నసంతర్పణ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలోని దండుబాటలో దసరా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కోటమ్మ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి దివ్య అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వహించిన అన్నసంతర్పణ కార్యక్రమానికి భక్తులు విశేషంగా హాజరయ్యారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.దసరా మహోత్సవంతో పాటు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.