తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, వారి అనుచరులు శాంతియుత వాతావరణాన్ని కాపాడుతూ పోలీసులకు సహకరించాలని సింగరాయకొండ సర్కిల్ పోలీస్ శాఖ సూచించింది. ఈ మేరకు సింగరాయకొండ సీఐ వై. శ్రీహరి ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రెస్ నోట్లో పేర్కొన్న ముఖ్యమైన సూచనలు: – శాంతిభద్రతలు నామినేషన్ సమయంలో ఎటువంటి గొడవలు, వాగ్వాదాలు లేదా ఘర్షణలకు పాల్పడరాదు. – నామినేషన్ కేంద్రం వద్ద క్రమశిక్షణ కేంద్రం వద్ద గుంపులుగా గుమిగూడకుండా పోలీసుల సూచనలు పాటించాలి. అనుమతి ఉన్నవారికే ప్రవేశం నామినేషన్ కేంద్రాల్లోకి ఎన్నికల నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న అభ్యర్థులు, వ్యక్తులు మాత్రమే వెళ్లాలి. ర్యాలీలు, వాహనాలు నామినేషన్ కేంద్రం వద్దకు ర్యాలీలతో రావడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం చేయరాదు. ముందస్తు అనుమతులు అవసరమైన కార్యక్రమాలకు అనుమతులు తీసుకోవాలి. అభ్యర్థుల బాధ్యత అభ్యర్థులు తమ అనుచరులకు తగిన సూచనలు ఇచ్చి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదు: ఎన్నికల ప్రక్రియ సందర్భంగా సాధారణ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించకూడదు. – ప్రచార నిబంధనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించరాదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదు. సోషల్ మీడియా: తప్పుడు వార్తలు, వదంతులు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించే సమాచారాన్ని ప్రచారం చేయరాదు. – పోలీసులకు సహకారం: బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు సహకరించి, వారు ఇచ్చే సూచనలను పాటించాలి. – ఫిర్యాదుల పరిష్కారం: ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు లేదా అవాంఛనీయ ఘటనలు గుర్తిస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. సింగరాయకొండ సర్కిల్ పరిధిలోని సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి మండలాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని సీఐ వై. శ్రీహరి కోరారు.