మూడవ మరియు ఆఖరి విడత డిగ్రీ ప్రవేశాలు అక్టోబర్ 24 నుండి 26 వరకు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కందుకూరు టీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ స్వయం ప్రతిపత్తి కళాశాలలో మొదటి రెండు విడతల ప్రవేశాల అనంతరం B.A, B.Sc మరియు B.Com కోర్సులలో మిగిలి ఉన్న ఖాళీ సీట్లను మూడవ మరియు ఆఖరి విడతలో భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపాల్ డా. యం. రవి కుమార్ తెలిపారు.ఇప్పటి వరకు ప్రవేశం పొందని విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.తమ కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అనుభవజ్ఞులైన, అత్యంత అర్హత కలిగిన అధ్యాపక బృందం, మెరుగైన విద్యా ప్రమాణాలు, అధునాతన ప్రయోగశాల సౌకర్యాలు ఉన్నాయని తెలియజేశారు.మూడవ విడత ప్రవేశాలకు విద్యార్థుల రిజిస్ట్రేషన్ అక్టోబర్ 24 నుండి 26 వరకు ఉంటుందని, పూర్తీ వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.