జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎన్నికల నియమావళికి అనుగుణంగా జరిగేలా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., తెలిపారు.21 నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేపథ్యంలో, బుధవారం ఒంగోలు నగరంలోని జడ్పీటీసీ నామినేషన్ల జరుగుతున్న నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. జిల్లా ఎస్పీ గారి వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఒంగోలు తాలూకా సిఐ విజయ్ కృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఉన్నారు. అనంతరం ఉలవపాడు, గుడ్లూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయాల వద్ద ఉన్న నామినేషన్ కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, సిబ్బంది విధుల నిర్వహణను సమీక్షించారు. విధుల్లో ఉన్న ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు తెలియచేసారు.నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు, కేంద్రాల పరిసరాల్లో పటిష్టమైన పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గారు తెలిపారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎన్నికల నిబంధనల ప్రకారం కేంద్రాల్లోకి ప్రవేశించేలా చూడాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్ద అనధికారిక గుంపులు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు, బెదిరింపులు, ఉద్రిక్తతలకు దారితీసే పరిణామాలపై ముందస్తు నిఘా ఉంచాలని, సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన కేంద్రాల వద్ద అప్రమత్తతంగా ఉండాలన్నారు. ఏదైనా అవాంఛనీయ పరిస్థితి తలెత్తిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి, చట్టప్రకారం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని తెలిపారు.రాజకీయ పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు మరియు ప్రజలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ, పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.జిల్లా ఎస్పీ గారి కందుకూరు డి.ఎస్.పి బాలసుబ్రమణ్యం కందుకూరి సిఐ జగదీష్ గుడ్లూరు సిఐ రమేష్ ఉలవపాడు ఎస్సై శివయ్య, గుడ్లూరు ఎస్సై వెంకట్రావు మరియు సిబ్బంది ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *