నిందితులకు శిక్ష పడటంలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీయస్.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
తేదీ 22.02.2017న మారెళ్ల గ్రామ పరిధిలోని గుండ్లకమ్మ వాగు ఇసుకలో గుర్తుతెలియని వ్యక్తి పుర్రె, ఎడమ చేయి బయటకు కనిపిస్తున్నాయని వీఆర్వో ముండ్లమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, Cr.No.21/2017 గా కేసు నమోదు చేశారు. అప్పటి దర్శి సీఐ కె. రాఘవేంద్ర గారు చేపట్టిన దర్యాప్తులో, మృతుడు అద్దంకి మండలం కలవకూరు గ్రామానికి చెందిన కలువ యేసుపాదం (22)గా గుర్తించారు. మారెళ్ల గ్రామానికి చెందిన కాటూరి యాకోబు తన భార్యతో మృతుడు సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో, పరిమి యేసయ్య (26) సహకారంతో హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మృతుడికి మద్యం తాగించి, మారెళ్ల గ్రామ పరిధిలోని గుండ్లకమ్మ వాగు వద్ద రాయితో తలపై కొట్టి హత్య చేసి, మృతదేహాన్ని కాల్చి ఇసుకలో పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపించి, కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసారు.అనంతరం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి కె. విజయలక్ష్మి గారు ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. పోలీస్ సిబ్బంది సాక్షులను కోర్ట్ లో సమయానుసారం హాజరు పరుస్తూ జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో పటిష్టమైన గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా సమర్థవంతంగా విచారణ నడిపి సరైన సాక్ష్యాధారాలతో నిందితుడుపై నేరనిరూపణ చేసినందున తేది 26.10.2026 న గౌరవ మార్కాపురం VIవ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్ట్ జడ్జి శ్రీమతి. V. భవాని గారు నిందితులకు జీవిత ఖైదు మరియు రూ.1500/- రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. సదరు కేసులో సరైన సాక్ష్యాధారాలు కోర్ట్ లో ప్రవేశపెట్టి సమర్థవంతంగా ట్రయల్ మానిటరింగ్ చేసి నిందితుడు శిక్షించబడటంలో క్రియాశీలక పాత్ర పోషించిన అప్పటి దర్శి సీఐలు K.V. రాఘవేంద్ర, M.శ్రీనివాసరావు మరియు కోర్టు లైజన్ సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.