విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా, అవినీతి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏసీబీ, ఒంగోలు ఇన్‌స్పెక్టర్ల అభ్యర్థన మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అవినీతి నిరోధక అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత, నిజాయితీ, జవాబుదారీతనాన్ని పెంపొందించడంతో పాటు అవినీతిని నిర్మూలించాల్సిన ఆవశ్యకతను ఈ పోస్టర్ తెలియజేస్తుంది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎవరైనా లంచం అడిగినా లేదా అవినీతికి పాల్పడినా, ఆ విషయాన్ని ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి తెలియజేయాలని, వాట్సాప్ నంబర్ 94404 40057కు సమాచారం పంపించాలని లేదా complaints-acb@ap.gov.in అనే ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. అదనంగా,0866-2428770 నంబర్ ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని తెలిపారు.
అవినీతిని నిర్మూలించడంలో ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని, అవినీతి కార్యకలాపాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారాన్ని ఏసీబీ అధికారులకు అందించి సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. ప్రజల భాగస్వామ్యంతోనే అవినీతిని అరికట్టి, సుపరిపాలనను సాధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రగతికి దోహదపడగలమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు టి. వి.శ్రీనివాసరావు, బి. రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *