తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గ :-
దర్శి మండలంలో మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 15, జనసేన 2 స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నాయి.ఈ సందర్భంగా దర్శి మండల ఎంపీపీ అభ్యర్థి పోకూరి నారాయణ స్వామి గారితో పాటు 16 మంది ఎంపీటీసీలు మంగళవారం సాయంత్రం దర్శిలోని టీడీపీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు అభినందనలు తెలియజేశారు.
టీడీపీ ఎంపీటీసీలు:
- బండి వెలిగండ్ల – మేడం కాశమ్మ
- బస్సు రెడ్డిపల్లి – చేరెడ్డి కాశమ్మ
- బొట్లపాలెం – పుచ్చ అంజమ్మ
- చందలూరు – పులి ఆదిలక్ష్మి
- దేవారం – గుంటూరు రమాదేవి
- ఈస్ట్ చౌటపాలెం – మారం బ్రహ్మారెడ్డి
- ఈస్ట్ వీరాయపాలెం – కనుమూరి నాగేశ్వరరావు
- ఈస్ట్ వెంకటాపురం – అనుకు గురవయ్య
- కొత్తపల్లి – రాచపూడి పద్మ
- పెద ఉయ్యాలవాడ – రాచపూడి సాల్మన్
- పోతకమూరు – తలపాల వెంకట్రావు
- రాజంపల్లి-1 – ఫణితపు కోటేశ్వరరావు
- రాజంపల్లి-2 – రాచపూడి ఇర్మియ
- సామంతిపూడి – నారాయణస్వామి
జనసేన ఎంపీటీసీలు:
- వెంకటాచలంపల్లి – పుప్పాల కళావతి
- లంకోజనపల్లి – యన్నగిరి నారాయణమ్మ
- దర్శి మండలంలో కూటమి ఐక్యతకు, ప్రజల మద్దతుకు ఈ ఏకగ్రీవ ఎన్నికలు నిదర్శనంగా నిలిచాయి.నూతనంగా ఎన్నికైన ఎంపీపీ అభ్యర్థి, ఎంపీటీసీలకు హృదయపూర్వక అభినందనలు