తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
మార్కాపురం జిల్లా గిద్దలూరు సబ్ జైలుని ఆదివారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని గిద్దలూరు న్యాయమూర్తి భరత్ చంద్ర సందర్శించారు. ఖైదీలకు అందుకున్న సదుపాయాలను పరిశీలించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. అంతేకాకుండా ఖైదీలతో కలిసి న్యాయమూర్తి ఆహారాన్ని భుజించారు. ఆహారం నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకుని న్యాయ సహాయం అందిస్తామని వారికి తెలిపారు. అలానే నేర ప్రవృత్తిని సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు న్యాయమూర్తి భరత్ చంద్ర కౌన్సిలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో జైల శాఖ అధికారులతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.