google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మహిళలు, బాలికలు భయరహితంగా జీవించే సురక్షిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శక్తి యాప్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు మరియు వివిధ ప్రజా వేదికలలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు శక్తి యాప్ డౌన్‌లోడ్ విధానం, వినియోగ పద్ధతి మరియు అత్యవసర పరిస్థితుల్లో SOS బటన్ ద్వారా తక్షణ పోలీస్ సహాయం పొందే విధానాన్ని వివరిస్తున్నారు.మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్ వేధింపులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు లేదా ఇతర అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు శక్తి యాప్ ద్వారా పోలీసులకు వెంటనే సమాచారం చేరుతుందని అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా మహిళలు తమ హక్కులు, భద్రతకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంపొందించుకొని, ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.సాంకేతికత ఆధారిత పోలీసింగ్ ద్వారా మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, ప్రతి మహిళకు భద్రతా భరోసా కల్పించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *