తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు బహిరంగ మద్యపానం (ఓపెన్ బూజింగ్) జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పార్కులు, ఖాళీ స్థలాలు, చెరువుల గట్లు, రహదారుల పక్క ప్రాంతాలు మరియు ప్రజలు అధికంగా సంచరించే ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు చేపట్టారు. ఓపెన్ బూజింగ్‌కు కేంద్రాలుగా మారిన ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తిస్థాయిలో క్లీన్ చేశారు.బహిరంగ మద్యపానం వల్ల మహిళలు, వృద్ధులు, చిన్నారులు మరియు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముండటంతో పాటు శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఓపెన్ బూజింగ్, అసాంఘిక కార్యకలాపాలు లేదా అనుమానాస్పద కదలికలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో సురక్షితమైన, ప్రశాంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పోలీసులు పేర్కొన్నారు.