తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

శ్రీశైలం ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన బ్లాక్‌స్పాట్ ‘దెయ్యాల మలుపు’ వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు దోర్నాల పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో వైపాలెం సి.ఐ, దోర్నాల పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపించేలా ఇన్‌వర్టెడ్ మిర్రర్ (Inverted Mirror) ఏర్పాటు చేశారు.ఈ మిర్రర్ ఏర్పాటు వల్ల డ్రైవర్లు ముందస్తుగా అప్రమత్తమై, ఎదురెదురు ఢీకొనే ప్రమాదాలను (Head-on collisions) నివారించవచ్చని అధికారులు తెలిపారు.ప్రజల ప్రాణ రక్షణే పోలీసుల ప్రధాన కర్తవ్యమని, ఘాట్ రోడ్డులోని ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో కూడా త్వరలో మరిన్ని భద్రతా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా అనుసరించి, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *