తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఎఆర్ కార్యాలయం మరియు అన్ని పోలీస్ స్టేషన్ లో ఆ మహనీయుని చిత్రపటానికి పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని ‘మౌ’లో జన్మించారు. అంబేద్కర్ గారు గొప్ప విద్యావేత్త, మహా జ్ఞాని, న్యాయవాది, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడని, దేశ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో వసుధైక కుటుంబంలా కలిసిమెలసి జీవించాలని, పేదలు, బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడ్డారని, అంటరానితనం, వివక్ష నిర్ములించాలని అలుపెరగని పోరాటం చేసిన కృషీ చేశారని కొనియాడారు. చట్టం ముందు అందరూ సమానం అనే తిరుగులేని హక్కును ఈ దేశపౌరులందరికీ రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన మహామనిషన్నారు. డా. అంబేద్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి తరానికి ఆదర్శమన్నారు. Mఈ కార్యక్రమంలో ఆర్ఐలు సీతారామిరెడ్డి, రమణ రెడ్డి,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
