తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ గ్రామములో వేంచేసియున్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానములో గురువారం ఆలయ చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు,ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఉగాది పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తొలిత ఉదయం శ్రీ స్వామివారి సన్నిధిలో అక్షరాబ్యాసం జరిపామని వారు తెలిపారు సాయింత్రం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించి అనంతరం కళ్యాణ మహోత్సవం కార్యక్రమము నిర్వహించారు . అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదములు అందచేశారు. ఈ కార్యక్రమములో ఆలయ ముఖ్య అర్చక ఉదయగిరి వెంకట శేష లక్ష్మి నరసింహ చార్యులు,అర్చకులు ఉదయగిరి నరసింహ చార్యులు, విక్కిరాల నరసింహ చార్యులు, ఉదయగిరి సుదర్శనాచార్యులు, రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *