తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు :-
గూడూరు పట్టణం లోని వ్యవసాయశాఖ కార్యాలయం లో సహాయ వ్యవసాయ సంచాలకులు, గూడూరు వారి కార్యాలయం లో VAA & VHA లతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖలతో సహాయ వ్యవసాయ సంచాలకులు , గూడూరు బి. గోపి నాయక్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసినది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ,ప్రకృతి వ్యవసాయమే రాబోయే కాలానికి శరణమని వివరిస్తూ ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు అడిగేసి రైతులకు తక్కువ ఖర్చుతో నిరంతరాదాయం చేకూర్చే విధంగా ప్రతి సిబ్బంది కూడా రైతులకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించి ఎక్కువ మంది రైతులని ఎక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం లోకి తీసుకురావాలని సూచించారు.జిల్లా నుండి వచ్చిన ప్రకృతి వ్యవసాయ NFA మధు ప్రకృతి వ్యవసాయంలోని 9 సర్వత్రిక సూత్రాలు వాటి ఉపయోగాలు ప్రతి రైతు ఈ ప్రకృతి వ్యవసాయ సార్వత్రిక సూత్రాలను ఏ విధంగా పాటించాలి అన్న విషయాలపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో బయో ఇన్పుట్స్ ఔటపుట్స్ రిసోర్స్ సెంటర్స్ (BRC) యొక్క ప్రాముఖ్యతను , ఈ BRC సెంటర్ లల్లో రైతులకు కావలసినటువంటి కషాయాలు , ద్రావణాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని ప్రతి రైతు వీటిని వినియోగించుకునేలా చేయాలని వివరించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో నిరంతర ఆదాయం సమకూర్చే విధంగా ఎనీ టైం మనీ (ATM), ఏ గ్రేడ్ మోడల్ గురించి ఆ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఏ మోడల్ ద్వారా రైతులకు ఏ విధంగా నిరంతర ఆదాయం వస్తుంది అన్న విషయాల పైన శిక్షణ ఇవ్వడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి గూడూరు వి. రమేష్ మాట్లాడుతూ, ప్రతి VAA & VHA పరిధిలో ఉన్నటువంటి రైతులతోటి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని రైతులతో PMDS ప్రీ- మాన్ సూన్ డ్రై సోయింగ్ నవధాన్యాల సాగు పద్దతి ద్వారా భూమిని ఏ విధంగా సారవంతం చేసుకుంటాము పశువులను వ్యవసాయంతో ఎలా అనుసంధానం చేసి రైతులకు నిరంతరం ఆదాయం సమాకుర్చుకోవాలి అనే విషయాల పైన పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన మంచి ఆహారాన్ని ప్రతి రైతు తినే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.