తొలి శుభోదయం న్యూస్ మంగళగిరి:-

దర్శి నియోజకవర్గంలోని డిగ్రీ కాలేజీ శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, ఐటీ & విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరారు.ఈ విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన అంచనాలను సిద్ధం చేసి పంపాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించినట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా డాక్టర్ లక్ష్మీ, నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సందర్భంగా దర్శి డిగ్రీ కాలేజీకి శాశ్వత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు తరగతి గదుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని వివరించగా, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *