తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
ఆంధ్రప్రదేశ్ ప్రవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ సమావేశం సోమవారం యూనియన్ నాయకులు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ అధ్యక్షులు డి వి సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రావ్యాప్తoగా ప్రవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమగ్ర సర్వే యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా కందుకూరు ప్రాంతానికి రావడం జరిగిందని అన్నారు.రాష్ట్ర యూనియన్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను గురించి వివరించారు. ప్రవేట్ వర్కర్లుగా ఎందరో యువత పనిచేస్తున్నారని. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందడం లేదని అన్నారు. ప్రభుత్వం స్కిల్డ్ వర్కర్స్ జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా సహకారం అందించాలని కోరారు. ముఖ్యంగా చేతి పనిమీద ఆధారపడి చాలీ చాలని సంపాదనతో జీవనం సాగిస్తున్నారని వారందరికీ నివేసన స్థలాలు ఇవ్వాలని కోరారు.
కార్యక్రమం లో కందుకూరు మండల ప్రకాశం మోటర్ రివైండింగ్ అధ్యక్ష కార్యదర్సులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.