తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం& మార్కాపురం పోలీస్:-
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ఓపెన్ బూజింగ్ (బహిరంగ మద్యపానం) జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా పార్కులు, ఖాళీ స్థలాలు, రహదారుల పక్కన ఉన్న ప్రాంతాలు, చెరువుల గట్లు మరియు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా ఉంచి చర్యలు చేపట్టారు. ఓపెన్ బూజింగ్కు కేంద్రాలుగా మారిన ప్రాంతాలను గుర్తించి వాటిని శుభ్రం చేయించారు.అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని అవగాహన కల్పించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సురక్షితమైన, పరిశుభ్రమైన మరియు ప్రశాంతమైన సమాజ నిర్మాణంలో భాగంగా ఇటువంటి ప్రత్యేక డ్రైవ్లు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.