google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహిళలు, బాలికల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం పోలీసులు సంయుక్తంగా శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, మహిళలు, ప్రజలకు శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో అందించే సేవల గురించి వివరించారు.శక్తి యాప్ ద్వారా ప్రమాద సమయంలో ఒక బటన్ నొక్కగానే పోలీసులకు సమాచారం చేరుతుందని, మహిళల భద్రత కోసం ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. అలాగే మహిళలు తమ మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని నమోదు చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా పోలీసులు మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రజల భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసు శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.ప్రజలు శక్తి యాప్‌ను విస్తృతంగా వినియోగించి తమ భద్రతను మరింత పెంపొందించుకోవాలని అధికారులు కోరారు. మహిళల రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖ నిరంతరం ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *