తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లలో విస్తృత స్థాయిలో భద్రతా తనిఖీలు చేపట్టారు.ప్రజలు అధిక సంఖ్యలో రాకపోకలు సాగించే ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను గుర్తించే చర్యలు చేపట్టారు. స్టేషన్లు, బస్టాండ్లలో ప్రయాణికుల లగేజీలు, సామగ్రిని తనిఖీ చేయడంతో పాటు భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రయాణికులకు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజల రక్షణ, నేరాల నివారణ మరియు శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.