తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలులోని SGVS కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ మహాసభలో దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు ,జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు,జిల్లా శాసనసభ్యులు ,ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.రాష్ట్రంలో గత రెండేళ్లుగా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఈ విజయోత్సవ సభ విజయవంతంగా నిర్వహించబడింది.