తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శివారు ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కీలక అడుగు వేశాము.రూ. 50.75 కోట్ల వ్యయంతో అమృత్ 2.0 మరియు UIDF పథకాల కింద చేపట్టనున్న తాగునీటి అభివృద్ధి పనులకు కందుకూరు టిడ్కో ఇళ్ల సమీపంలో భూమిపూజ చేసి నిర్మాణ పనులను ప్రారంభించాము.
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం మా ప్రభుత్వ ప్రాధాన్యత. ఈ పనులు పూర్తయిన అనంతరం శివారు ప్రాంతాల ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.