తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుమేరకు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలు నగరంలోని నిర్మల్ నగర్ పార్క్ నందు నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు గారు యోగాసనాలు వేసి, పాల్గొన్న వారికి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపద అని, నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని అధిగమించడానికి, ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కొంత సమయం యోగాభ్యాసానికి కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. యోగాభ్యాసం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని జనార్దన్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య , నిర్మల్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యార్థులు, యువత, మహిళలు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
