తొలి శుభోదయం న్యూస్ కంభం :-
కంభంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పలు శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలను ప్రదర్శించారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని ఎంపీడీవో వీరభద్రాచారి అన్నారు. పలు ఆసనాలు వేసి యోగాపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీడీవో, తహసిల్దార్, ఎంఈఓ,పలు శాఖల అధికారులు సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు,హెల్త్ డిపార్ట్మెంట్,డ్వాక్రా మహిళలు,టీడీపీ వైసిపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.