తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ వి. షాలిని రెడ్డి పాల్గొని మాట్లాడుతూ యోగ జీవితంలో ఒక భాగం కావాలని, యోగా వలన ఒత్తిడి,ఆందోళనలు అధిగమించవచ్చని,ప్రశాంత జీవన విధానానికి యోగ ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. భారతీయ జీవన సాంప్రదాయంలో యోగా ఎంతో ప్రాముఖ్యమైనదని విద్యార్థులు, ఉపాధ్యాయులు యోగా వలన మనో స్థిరత్వాన్ని సాధించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు శివ యాజమాన్యం వి.మర్రెడ్డి,కరణం శ్రీనివాసరావు,ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.