google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-

ఫాదర్స్ డే సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధంలో దేశానికి విశిష్ట సేవలందించిన కీ.శే. మేజర్ పరమానందం గారిని స్మరించుకుంటూ ఆయన కుమారుడు, వ్యవసాయ శాఖలో ఇంజనీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన గుర్రాల రాజభూషణం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఉలవపాడు మండలంలోని గిరిజన కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వయోజనులు మరియు చిన్నారులకు పుస్తకాలు, సీజనల్ పండ్లు పంపిణీ చేశారు. విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సేవ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న శ్రీ గుర్రాల రాజభూషణం గత పది సంవత్సరాలుగా తన తండ్రి జ్ఞాపకార్థం వివిధ సేవా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ కార్యక్రమాన్ని న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు సమన్వయం చేసి నిర్వహించారు. స్థానిక ప్రజలు, చిన్నారులు, పెద్దలు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని శ్రీ రాజభూషణం సేవా భావాన్ని కొనియాడారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *