తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (APSCPCR) చైర్మన్ శ్రీ వేటుకూరి ఏ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు , కమిషన్ సభ్యులు శ్రీ వి. గాంధీ బాబు కలిసి సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించారు. బాలల సంక్షేమం, రక్షణ మరియు బాలికల హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు.పర్యటనలో భాగంగా ఒంగోలులోని పలు స్కానింగ్ సెంటర్లను సందర్శించి, గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణను నిషేధించే PCPNDT చట్టం అమలు, రికార్డుల నిర్వహణ, నిబంధనల పాటింపు వంటి అంశాలను సమీక్షించారు. ఆడ శిశువుల రక్షణకు భంగం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఉపేక్షించబోమని స్పష్టం చేస్తూ, సంబంధిత అధికారులు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.అనంతరం ప్రభుత్వ బాల సదన్ ను సందర్శించిన చైర్మన్ శ్రీ వేటుకూరి ఏ.వి.ఎస్. సూర్యనారాయణ రాజు , మరియు కమిషన్ సభ్యులు శ్రీ వి. గాంధీ , అక్కడి బాలల వసతి, ఆహారం, విద్య, ఆరోగ్య సేవలు, పరిశుభ్రత, భద్రత