google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించునున్న నేపథ్యంలో ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత, ఐఏఎస్ గారు , జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపియస్.,గారు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు,గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మరియు జిల్లా అధికారులు పరిశీలించారు.హెలిప్యాడ్ ప్రదేశం, ప్రజా వేదిక, పార్కింగ్ ప్రాంతాలను, సీఎం కాన్వాయ్ రూట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు చుట్టు ఉన్న ప్రాంతములను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా తీసుకోవాల్సిన ఏర్పాట్లు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు వీఐపీల వాహనాల రాక, సభా స్థలంలో వేదిక, పార్కింగ్‌ ఏరియా, సీఎం ప్రవేశం, నిష్క్రమణ స్థలాలను, హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఉన్న రూట్ ను, క్షుణ్ణంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. ఇతర శాఖల సమన్వయంతో అన్ని చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ గారి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ యం.శ్రీనివాసరావు, గిద్దలూరు అర్బన్ సీఐ కె. సురేష్, రూరల్ సీఐ రామకోటయ్య, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed