google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కందుకూరు డివిజన్ ఎంఆర్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ సభ్యులు కందుకూరులోని సబ్ కలెక్టర్ గారు అయినా డి. హిమవంసి గారిని కలిసి కందుకూర్ డివిజన్ పరిధిలోని ప్రైవేటు కళాశాల యందు అధిక ఫీజులు మరియు పుస్తకములకు కూడా అమ్ముతూ అత్యధిక రేట్లు వసూలు చేయుచున్నారు వారి ఇష్టానుసారంగా, కనుక మీరు వెంటనే కలుగజేసుకొని ప్రైవేటు పాఠశాలల యందు తరగతుల వారీగా ఫీజుల వివరములు ఉండేటట్టు ప్రతి ప్రైవేట్ సాలయందు పట్టిక పెట్టమని కోరడం జరిగినది, మరియు పాఠ్యపుస్తకములు కూడా విపరీతమైన రేట్లు అమ్ముచున్నారు ఒకటవ తరగతి క్లాస్ పుస్తకములు 7వేల రూపాయలకు అమ్ముచున్నారు. ప్రైవేటు పాఠశాలలు వాళ్ళు ఇస్తాను రాసారంగా పాఠ్యపుస్తకములు అమ్మకూడదని గవర్నమెంట్ చెబుతున్న కూడా వాళ్ళ ఇష్టానుసారంగా అమ్ముచున్నారు కనుక వెంటనే మీరు వీరిపై చర్యలు తీసుకోవలసినదిగా కోరడము జరిగినది. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఎస్డి గౌస్ బాష వైస్ ప్రెసిడెంట్ షేక్ సలాం గారు వైస్ సెక్రటరీ మనోహర్ గారు మహిళా విభాగం అధ్యక్షులు ఆర్ మాధవి గారు పాల్గొనడం జరిగినది. ఈ సందర్భంగా డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన షేక్ సలాం గారు మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తూ పుస్తకముల రేట్లు వాళ్ళు ఇష్టాన్ని రీతిగా వసూలు చేస్తున్నారని అలానే ప్రైవేటు పాఠశాలలు ప్రతి రెండవ శనివారం సెలవు కూడా ఇవ్వడం లేదని మరియు వారానికి ఒక్క ఒక్కరోజైనా పిల్లల ఆరోగ్యం కోసం పి ఈ టి క్లాసులు నిర్వ హించాలని కోరడం జరిగినది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed