తొలి శుభోదయం:-

పొగాకు వేలం కేంద్రం బోర్డు లో పొగాకు పంట నియంత్రణ పొగాకు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో 26 వ పొగాకు బోర్డ్ వేలం నిర్వహణ అధికారి వి. శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం అంతర్జాతీయం గా వాతావరణ పరిస్థితులు ఉన్నాయనీ, పొగాకు పండించే బ్రిజిల్, చైనా, జింబంబే మొదలగు దేశాలలో పొగాకు ఉత్పత్తి అధికంగా ఉన్నదని చెప్పారు. ఈ సంవత్సరం పొగాకు ధరలలో హెచ్చు తగ్గులు ఉండవచ్చును అని రైతులకు తెలియచేశారు. అందువల్ల రైతులు ఎవ్వరూ అధిక ధరలకు బ్యారన్ లను, పొలాలను కౌలుకి తీసుకొని పొగాకు పంటను సాగు చేసి నష్టపోవద్దుని తెలియజేశారు ఈ సంవత్సరం పొగాకు పంట ధరలు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చునని
మంచి గ్రేడు పొగాకు పండితే రైతులు మరింత ఇబ్బంది పడవలసి వస్తుందని తెలియచేశారు. పొగాకులో పొటాసియం వినియోగం పెంచడం వల్ల కొంత హై గ్రేడు పొగాకు దిగుబడి సాధించవచ్చు అని పొగాకు మండేల మీద ఎక్కవ కాలం చెడిపోకుండా ఉండే సామర్థ్యం పెరుగుతుందని తెలియజేశారు. రైతు సోదరులు పోగాకు బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే పొగాకు పండించాలనికోరారు. ఈ కార్యక్రమం లో పొగాకు బోర్డు క్షేత్ర స్థాయి అధికారి అశోక్ రాజ్ ఐటీసీ కంపెన్ ప్రతినిధి జి.వెంకటేష్ , జిపిఐ కంపెనీ ప్రతినిధి షేక్. రబ్బానీ రైతులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *