తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాంత్వన సేవ సమితి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన
‘డ్రగ్స్ వద్దు బ్రో ‘ పోస్టర్ ను ( గోడపత్రిక ) ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
ఆంధ్రప్రదేలో మాదకద్రవ్యాల నిర్మూలనకు గత రెండు సంవత్సరాల నుండి ప్రభుత్వం రాజులేని పోరాటం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఆపరేషన్ గరుడ ఈగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డ్రగ్స్ కంట్రోల్ పరిపాలన శాఖ స్థానిక పోలీసులతో కలిసి మెడికల్ షాపులలో మత్తుమందులు అమ్మకాన్ని నియంత్రించడం జరిగిందని అన్నారు.
ఆపరేషన్ ఈగల్ ద్వారా రైల్వే శాఖతో కలిసి జాయింట్ ఆపరేషన్ రైలు ద్వారా చేస్తున్న వారిని పట్టుకుని మత్తు పదార్థాలు సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు.
యువత మాదకద్రవ్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు.సింగరాయకొండ ఎస్సై లేళ్ళ సుధీర్ బాబు మాట్లాడుతూ
ఎక్కడైనా డ్రగ్స్ సమాచారం తెలిసిన డ్రగ్స్ నేరాల నిరోధానికి ఫిర్యాదులు మరియు సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 1972 కాల్ చేయాలని చెప్పారు.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. సాంత్వనా సేవా సమితి డైరెక్టర్ ఆర్. జయ కుమార్ మాట్లాడుతూ…
మాదకద్రవ్యాల పై అవగాహన కార్యక్రమాలు ప్రతి పాఠశాలలోనూ , ప్రతి గ్రామంలో అవగాహన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెత్తళ్ల రాజారాం మరియు సాంత్వనా సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఒంగోలులో జరిగిన భారీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.