తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మహిళలు, బాలికలు మరియు చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు సంయుక్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు మరియు ప్రజలకు శక్తి యాప్ యొక్క ప్రయోజనాలను వివరించి, వారి మొబైల్ ఫోన్లలో శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి వినియోగించే విధానంపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ద్వారా పోలీసులను వేగంగా సంప్రదించవచ్చని వివరించారు.అదేవిధంగా చిన్నారులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి సులభంగా అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించి, ఎలాంటి అనుచిత ప్రవర్తన ఎదురైనా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారు.