తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
ఒంగోలు మండలం ఉలిచి గ్రామం నందు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు గ్రామ సభ ను నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడమే ఈరెవిన్యూ సదస్సు లక్ష్యమని శాసనసభ్యులు గారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రజల నుండి మొత్తం 37 అర్జీలు అందాయి. ప్రతి ఒక్కరి అర్జీని స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే గారు వారి సమస్యలను వివరంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు – సరిహద్దులు, యాజమాన్య హక్కులు, వారసత్వ సమస్యలు, భూ రికార్డుల్లో తప్పులు ,పేర్లు సర్వే నంబర్లు, విస్తీర్ణంలో పొరపాట్లు, పట్టాదారు పాస్‌బుక్ సమస్యలు ,కొత్త పాస్‌బుక్ జారీ, సవరణలు, భూమి మ్యుటేషన్ (పేరుమార్పిడి), ఆక్రమణలు ,సర్వే మరియు రీ-సర్వే తదితర సమస్యలు పై రావడం జరిగినది. రెవెన్యూ అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టారు. ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇవ్వగా, సమస్యలను సాంకేతిక పరిశీలించి వేగంగా పరిష్కరించేందుకు పని చేస్తానని ప్రజలకు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో RDO చంద్రశేఖర్ నాయుడు, MRO కృష్ణమోహన్, MDO రాజశేఖర్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Seems like venue issues are a common concern everywhere. Did the meeting result in any solid solutions?