తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-

ఈ నెల 27వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్ణంశెట్టిపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో “సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్”ను ప్రారంభించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా లారీలు, బస్సులు మరియు ఇతర భారీ గూడ్స్ వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపు అమలు చేస్తున్నట్లు మార్కాపురం జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలు, వాహనదారులు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం 7.00 గంటల వరకు భారీ వాహనాలు, గూడ్స్ వాహనాలకు ఈ ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలు అమలులో ఉంటాయి.అదేవిధంగా కార్లు, బస్సులు మరియు ఇతర చిన్న వాహనాలకు ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు.ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు
నంద్యాల నుంచి గిద్దలూరు వైపు వచ్చే భారీ వాహనాలు (లారీలు, బస్సులు) మరియు మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు వచ్చే భారీ వాహనాలు (లారీలు, బస్సులు) మళ్లింపు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది.మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు వెళ్లే భారీ వాహనాలు మోట్టు – పోరుమామిళ్ల – మైదుకూరు మార్గం మీదుగా తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిందిగా సూచించారు.నంద్యాల నుంచి మార్కాపురం వైపు వెళ్లే భారీ వాహనాలు నంద్యాల – ఆళ్లగడ్డ – మైదుకూరు – పోరుమామిళ్ల –తాటిచెర్ల మోటు మార్గం మీదుగా ప్రయాణించాల్సిందిగా కోరారు.
వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు
మార్కాపురం నుంచి గిద్దలూరు వైపు వచ్చే వాహనాలు అవసరమైతే పందిళ్లపల్లి టోల్ గేట్ వద్ద నిలుపుదల చేసుకోవాలి.
నంద్యాల నుంచి మార్కాపురం వైపు వచ్చే వాహనాలు భీమేశ్వరం ఆలయం సమీపంలోని ఖాళీ ప్రదేశంలో తమ వాహనాలను నిలిపి ఉంచుకోవచ్చని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *