google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

సింగరాయకొండ యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో, రాబోయే ఆగస్టు నెలలో నిర్వహించనున్న టెట్ (TET) పరీక్షకు హాజరుకానున్న సర్వీసులోని ఉపాధ్యాయ మిత్రులకు ఉపయోగపడేలా యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ముద్రించిన ఎస్‌జీటీ (SGT) మెటీరియల్‌ను పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. హరిబాబు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు ఎల్. శ్రీనివాసరావు, జిల్లా మాజీ కార్యదర్శి వెంకయ్య, కామేపల్లి రిటైర్డ్ హెచ్‌ఎం కోటపాటి నారాయణ, జిల్లా ప్రచురణ విభాగం కన్వీనర్ బండి లక్ష్మీనారాయణ పాల్గొని, టెట్‌కు హాజరయ్యే ఉపాధ్యాయులకు విలువైన సూచనలు, సలహాలు అందించారు.ఈ కార్యక్రమంలో ఎస్. సునీల్ కుమార్ రెడ్డి, ఆనంద్ కుమార్, జాలయ్య, వి. విజయకుమారి, ఎన్. పార్వతి, ఎ. హిమబిందు, రమణారెడ్డి, శ్రీధర్, బి. శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *