ప్రజా ఫిర్యాదులకు పరిష్కారం అందించాలనే లక్ష్యంగా మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు మరియు పోలీస్ అధికారులు సోమవారం మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల వ్రాతపూర్వక వినతులను పోలీస్ అధికారులకు అందించి, వారియొక్క సమస్యలను వివరించారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, వాటిని చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో మార్కాపురం సిఐ అల్తాఫ్ హుస్సేన్, పొదిలి సీఐ రాజేష్ కుమార్, గిద్దలూరు అర్బన్ సీఐ సురేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *