కందుకూరు పట్టణంలోని తూర్పు వడ్డెపాలెం (12వ వార్డు) నందు నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా మాఊళ్ళమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు దివి రవీంద్రనాథ్ ను కలిసి శ్రీ రేణుకా మాఊళ్ళమ్మ తల్లి ఆలయానికి రావాలని ఆహ్వానం పలికారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు దివి రవీంద్రనాథ్ ఆదివారం శ్రీ రేణుక మాఊళ్ళమ్మ తల్లి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివి రవీంద్రనాథ్ ను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. రవీంద్రనాథ్ వెంట ఆలయ కమిటీ సభ్యులు కుంచాల శ్రీనివాసరావు , కుంచాల వెంకటరమణ , కుంచాల సురేష్ , కుంచాల మురళి బాబు , కుంచాల భాస్కర్ , కుంచాల బాలమురళి , కుంచాల మాధవ , కుంచాల శ్రీను తదితరులు ఉన్నారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *